Homeటెక్నాలజీSpam Calls | స్పామ్ కాల్స్ కట్టడి.. డీఓటీ, ట్రాయ్, టెల్కోల మధ్య చర్చలేంటి..

Spam Calls | స్పామ్ కాల్స్ కట్టడి.. డీఓటీ, ట్రాయ్, టెల్కోల మధ్య చర్చలేంటి..

అక్షరటుడే, హైదరాబాద్: Spam Calls | తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ , మోసపూరిత సందేశాలు నేడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. ఈ సమస్యను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (Department of Telecommunications), ట్రాయ్ (TRAI) , టెలికాం కంపెనీలు (టెల్కోలు) ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్పామ్‌ను నియంత్రించే బాధ్యత ఎవరిదనే దానిపై చర్చ జరుగుతుంది.

Spam Calls | స్పామ్ సమస్య ,నియంత్రణ చర్యలు:

దేశంలో ప్రస్తుతం 18,000 పైగా టెలిమార్కెటింగ్ కంపెనీలు పనిచేస్తున్నప్పటికీ, ఎక్కువ స్పామ్ కాల్స్ (spam calls) నమోదిత కంపెనీల నుంచి కాకుండా, నమోదు కాని కంపెనీల నుంచి వస్తున్నాయి. 2021లో నమోదిత కంపెనీలపై సుమారు 4 లక్షల ఫిర్యాదులు ఉంటే, 2024 నాటికి అవి దాదాపు సగానికి తగ్గాయి. అదే సమయంలో, నమోదు కాని కంపెనీలపై ఫిర్యాదులు 8 లక్షల నుంచి ఏకంగా 17 లక్షలకు పైగా పెరిగిపోయాయి.

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు, టెలికాం సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 2024 ఆగస్టు నుంచి 1,150 పైగా టెలిమార్కెటింగ్ కంపెనీలను (telemarketing companies) బ్లాక్ చేశాయి, 18.8 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేశాయి.

Spam Calls | బాధ్యత ఎవరిది?

ట్రాయ్ వాదన: ట్రాయ్ ప్రకారం, స్పామ్‌ను కట్టడి చేయాల్సిన ప్రధాన బాధ్యత టెల్కోలదే. సమస్య తలెత్తితే వినియోగదారులు మొదటగా సంప్రదించేది టెలికాం ఆపరేటర్లనే. టెల్కోలు తమ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, వాటిపై జరిమానాలు విధించే అధికారం ట్రాయ్‌కు ఉంది.

టెల్కోల వాదన: తాము కేవలం మధ్యవర్తులమేనని టెల్కోలు చెబుతున్నాయి. స్పామ్ కాల్స్ పంపే టెలిమార్కెటర్లు , బ్రాండ్స్‌పైనే జరిమానాలు విధించాలని అవి కోరుతున్నాయి.

పరిష్కార మార్గాలు: ఈ వివాదాల మధ్య, డాట్ ,ట్రాయ్ (DOT and TRAI) కొన్ని పరిష్కారాలపై దృష్టి సారించాయి. టెలిమార్కెటర్ల కోసం ఒక అధికారిక లైసెన్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని డాట్ ఆలోచిస్తుంది. దీనివల్ల అధీకృత సంస్థలు మాత్రమే వాణిజ్య సందేశాలను పంపడానికి అవకాశం లభిస్తుంది.

టెలిమార్కెటర్లను అధికారిక వ్యవస్థ కిందకు తీసుకురావడం వల్ల స్పామ్ ముప్పును నియంత్రించవచ్చా లేదా అనే అంశాన్ని ట్రాయ్ పరిశీలిస్తోంది. ఏదేమైనా, టెలికాం సంస్థలు కీలక పాత్ర పోషిస్తే తప్ప ఈ స్పామ్ సమస్యకు (spam problem)శాశ్వత పరిష్కారం లభించదని నిపుణులు భావిస్తున్నారు.