ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ

    SP Rajesh Chandra | మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం (State Forensic Department) కీలకం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని (Mobile forensic vehicle) అందజేసింది.

    ఈ వాహనాన్ని ఎస్పీ రాజేష్​ చంద్ర గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ ఫోరెన్సిక్‌ వాహనం జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనుందన్నారు.

    ఇకపై ఏదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్‌, ఫింగర్‌ ప్రింట్‌ (Finger prints) అధికారులు, సిబ్బంది ఈ మొబైల్‌ వాహనంలో చేరుకుంటారన్నారు. సంఘటన జరిగిన స్థలం నుండి పలు రకాల సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్‌ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహిస్తారని చెప్పారు.

    అనంతరం సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్​డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి (Chaitanya Reddy), డీఎస్పీలు శ్రీనివాస్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు, క్లూస్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Sriram sagar project | కొద్దిసేపట్లో శ్రీరాంసాగర్ వరద గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మళ్లీ ఎత్తనున్నారు. రాత్రి...

    Dark Circles | కళ్ల కింద నల్లటి వలయాలా.. ఈ అద్భుతమైన చిట్కాలతో దూరం చేసుకోండి!

    అక్షరటుడే, హైదరాబాద్: Dark Circles | ముఖానికి అందాన్నిచ్చే కళ్ళు కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) వస్తే...

    Kamareddy | ప్రియుడితో కలిసి భర్త హత్య.. నిందితులకు జీవిత ఖైదు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను ప్రియుడితో హత్య చేయించిన...

    Nandipet mandal | పేకాట స్థావరంపై దాడి.. తొమ్మిది మంది అరెస్ట్​

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nandipet mandal | నందిపేట్ మండలం (Nandipet mandal) నూత్ పల్లి శివారులో...

    More like this