అక్షరటుడే, కామారెడ్డి : TU South Campus | భువనేశ్వర్ (Bhubaneswar)లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్లో సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ హెడ్ డాక్టర్ అంజయ్య బందెలకు భారత్ వికాస్ అవార్డ్ లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ (Institute of Self-Reliance) ఆధ్వర్యంలో ఒడిశా (Odisha)లోని ప్రెస్‌క్లబ్‌లో ‘పచ్చని భవిష్యత్ దిశగా పునర్నిర్మాణం’ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు.
TU South Campus | వివిధ రంగాల్లో ప్రతిభచూపిన మేధావులకు..
వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మేధావులకు భారత్ వికాస్ (Bharat Vikas) అవార్డులతో సత్కరించారు. అవార్డు పొందిన సందర్భంగా సౌత్ క్యాంపస్‌లో సోమవారం ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ (Principal Dr. Sudhakar Goud) ఆధ్వర్యంలో అధ్యాపకుడు డాక్టర్ అంజయ్యను సన్మానించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. సౌత్ క్యాంపస్ అధ్యాపకుడికి అవార్డు రావడం చాలా సంతోషమని, ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి అవార్డ్ ఇచ్చారని పేర్కొన్నారు. మిగతా అధ్యాపకులు ఈ అవార్డు రావడాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్‌లో అవార్డులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, హాస్టల్ వార్డెన్ సునీత, ఎన్ఎస్ఎస్ అధికారి హరిత లక్కరాజు, ఏపీఆర్వో సరిత పిట్ల, అధ్యాపకులు సబిత, లలిత, మోహన్ బాబు, నాగరాజు, కవిత తోరణ్, ప్రతిజ్ఞ, నారాయణ, నర్సయ్య, రమాదేవి, వైశాలి, సునీల్, శ్రీనివాస్, కనకయ్య, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.