అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Africa vs Namibia టీ20 క్రికెట్‌లో పసికూన నమీబియా గొప్ప సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన ఉత్కంఠభరిత ఏకైక టీ20 మ్యాచ్‌లో నమీబియా నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిస్తూ.. తన క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ (International T20 cricket) లో అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా జట్టుపై అసోసియేట్ జట్టు నమీబియా సంచలన విజయం సాధించింది.
నమీబియా రాజధాని విండ్‌హోక్ Windhoek వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ లో చివరి బంతి వరకూ ఉత్కంఠ కొనసాగగా.. చివరికి నమీబియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి భారీ షాక్ ఇచ్చింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు, నమీబియా బౌలర్ల దాటికి కుదేలైంది. వరుసగా కీలక వికెట్లు కోల్పోయిన ప్రొటీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 134/8 పరుగులు మాత్రమే చేయగలిగింది.
నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్ లాంటి ప్రొటీస్ బౌలర్లు ఉన్నప్పటికీ, ఇది తక్కువ టార్గెట్ అని నమీబియా ఆటగాళ్లు భావించారు.
South Africa vs Namibia | ఘోర పరాజయం..
లక్ష్య ఛేదనలో నమీబియా Namibia ఆటగాళ్లు తలా చేయి వేయగా.. చివర్లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను తమవైపుకి తిప్పాడు.
చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సిన సమయంలో.. తొలి బంతికి సిక్సర్ కొట్టి జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరమైన వేళ.. ఫోర్‌తో ఫినిష్ చేస్తూ జట్టుకు గెలుపు అందించాడు. నమీబియా చివరి బంతికి గెలిచిన రెండో టీ20 మ్యాచ్ T20 cricket match ఇది.
మొదటిది 2022లో జింబాబ్వేపై సాధించింది. దక్షిణాఫ్రికా చివరి బంతికి ఓడిన రెండో టీ20 మ్యాచ్ ఇది. మొదటిది 2016లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అసోసియేట్ నేషన్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిన రెండో సందర్భం. గతంలో 2022 టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది.
నమీబియా Namibia ఫుల్ మెంబర్ జట్లపై సాధించిన నాలుగో విజయం. ఇంతకు ముందు ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంకలపై విజయం సాధించింది. ఇక నమీబియా టీమ్‌కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు నమీబియా జట్టును అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. “ఈ గెలుపు ద్వారా తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది నమీబియా. ఇది మాకు చాలా పెద్ద విజయం. టాప్ టీమ్‌ను ఓడించటం అనేది ఎంతో గర్వకారణం..” అని నమీబియా కెప్టెన్ అన్నాడు.
ఈ షాకింగ్ ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా South africa జట్టు దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా.. లేక నమీబియా మళ్లీ మరో సంచలనం కోసం సిద్ధమవుతుందా.. అనేది ఆసక్తికరంగా మారింది.