అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh Women vs South Africa women | మహిళల వన్డే వరల్డ్ కప్ Women’s ODI World Cup లో దక్షిణాఫ్రికా జట్టు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
సోమవారం బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సఫారీ (South Africa) లు 3 వికెట్ల తేడాతో గెలుపొందారు.
మహిళల ప్రపంచకప్ Women’s ODI World Cup ఉత్కంఠ భరిత మ్యాచ్‌లతో రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ కొత్త ఉత్కంఠను రేపుతోంది. గత రాత్రి దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ప్రేక్షకులను ఉత్కంఠకి గురిచేసింది.
చివరికి డీ క్లెర్క్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్‌తో సఫారీలకు ఘనవిజయాన్ని అందించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా చెమటోడ్చింది.
మ్యాచ్ చివరి ఓవర్‌కు చేరేసరికి 8 పరుగులు అవసరమయ్యాయి. ఆ సందర్భంలో డీ క్లెర్క్ (37 నాటౌట్) ఫోర్, సిక్సర్ బాది సఫారీలను మూడు వికెట్ల తేడాతో గెలిపించింది.
Bangladesh Women vs South Africa women | థ్రిల్లింగ్ మ్యాచ్..
ఇటీవలే భారత్‌పై మెరుపు అర్ధశతకం బాదిన ఈ ఆల్‌రౌండర్, మరోసారి ఒత్తిడిలోనూ చెలరేగి జట్టుకు విజయాన్ని అందించింది. మ్యాచ్ మొత్తంలో బంగ్లాదేశ్ బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ఫాహిమా ఖాతూన్ , సల్మా ఖాతూన్ వంటి స్పిన్నర్లు సఫారీ బ్యాటర్లను కట్టడి చేశారు. కానీ, ఫిల్డర్లు వదిలేసిన కీలక క్యాచ్‌లు జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
చోలే ట్రయాన్ , డీ క్లెర్క్ క్యాచ్‌లు వదిలేయడం వల్లే బంగ్లా ఆశలు నీరుగారిపోయాయి. ఒక దశలో వరుసగా వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును మరినే కాప్(56), చోలే ట్రయాన్ (62)లు నిలబెట్టారు. వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం ఏర్పడడంతో మ్యాచ్ దశ మారింది.
ట్రయాన్ అవుట్ అయిన తర్వాత బాధ్యత తీసుకున్న డీ క్లెర్క్ గేమ్‌ను చివరి వరకూ తీసుకెళ్లి విజయాన్ని ఖాయం చేసింది. లక్ష్య ఛేదనలో సఫారీలకు ఆరంభం అంతగా అనుకూలంగా లేకపోయింది.
లారా వొల్వార్డ్త్ (31) రనౌట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. దాంతోపాటు సినాలో జాఫ్తా (4)ను ఫాహిమా ఖాతూన్ తొలి బంతికే బౌల్డ్ చేయడంతో సఫారీల పరిస్థితి మరింత క్లిష్టమైంది.
అంతిమంగా చివరి ఓవర్‌లో డీ క్లెర్క్ చూపించిన ధైర్యం, బంగ్లాదేశ్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాయి. సఫారీలు వరల్డ్ కప్‌లో మరో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసుకున్నారు.