Homeక్రీడలుIND vs SA | సౌతాఫ్రికా ఆలౌట్​.. భారత్​ టార్గెట్​ 271 పరుగులు

IND vs SA | సౌతాఫ్రికా ఆలౌట్​.. భారత్​ టార్గెట్​ 271 పరుగులు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సఫారీ జట్టు ఆలౌట్​ అయ్యింది. టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా టీం నిర్ణీత 50 ఓవర్లు పూర్తి చేయకముందే వెనుదిరిగింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: IND vs SA | దక్షిణాఫ్రికాతో (South Africa ) జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సఫారీ జట్టు ఆలౌట్​ అయ్యింది. టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా టీం నిర్ణీత 50 ఓవర్లు పూర్తి చేయకముందే వెనుదిరిగింది. 47.5 ఓవర్లలో 270 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ గెలుపుకోసం 271 పరుగులు చేయాల్సి ఉంది.

IND vs SA | క్వింటన్​ సెంచరీ

సఫారీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) ఒక్కడే నడిపించాడు. 106 పరుగులతో అద్భుత శతకం సాధించిన అతను జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కెప్టెన్ తెంబా బవుమా (Captain Temba Bavuma) 48 పరుగులు జోడించగా.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా పరుగుల జోరు ఆగిపోయింది.

భారత బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శన కనబర్చింది. చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav), యార్కర్ స్పెషలిస్ట్ ప్రసిద్ధ్ కృష్ణలు చెరో నాలుగేసి వికెట్లు పడగొట్టి సఫారీ జట్టు వెన్ను విరిచారు. అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజాలు తలో ఒక్కో వికెట్ తీశారు. భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్​కు దిగనుంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకం.

Must Read
Related News