Kamareddy | తల్లిపై కొడుకు హత్యాయత్నం.. డబ్బులు, బంగారం కోసం ఘాతుకం..

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | డబ్బులు, బంగారం ఇవ్వడం లేదని మద్యం మత్తులో తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. Kamareddy | కామారెడ్డి పట్టణంలో.. కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి (Vivekananda Colony) చెందిన కంచర్ల గౌరవ్వ వద్ద ఉన్న డబ్బు, మెడలో […]

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | డబ్బులు, బంగారం ఇవ్వడం లేదని మద్యం మత్తులో తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Kamareddy | కామారెడ్డి పట్టణంలో..

కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి (Vivekananda Colony) చెందిన కంచర్ల గౌరవ్వ వద్ద ఉన్న డబ్బు, మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు తీసుకోవడానికి కొడుకు రాజేష్ ప్రయత్నించగా గౌరవ్వ నిరాకరించింది. దాంతో మద్యం మత్తులో ఉన్న రాజేష్ తన చేతికి ఉన్న కడియంతో గౌరవ్వపై దాడి చేయగా తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయింది. పోలీసులకు సమాచారం రావడంతో గౌరవ్వ పరిస్థితి గమనించిన పోలీసులు పెట్రోకార్​లో జీజీహెచ్​కు తరలించారు. అనంతరం తల్లి వద్ద నుంచి తీసుకున్న బంగారు గొలుసును జేపీఎన్ రోడ్డులో అమ్మడానికి ప్రయత్నించిన రాజేష్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించడం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు, కడియం, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గౌరవ్వకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందన్నారు. తల్లిదండ్రుల బాధ్యత కొడుకులపై ఉంటుందని, వారిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు ఉన్నాయని ఏఎస్పీ గుర్తు చేశారు.

Kamareddy | ఇంటికి తీసుకెళ్తామని చెప్పి నగదు, మొబైల్ చోరీ

కల్లు తాగి మత్తులో ఉన్న వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అతని వద్ద మొబైల్, డబ్బులు చోరీ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఈనెల 13న పట్టణానికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న కల్లు దుకాణంలో కల్లు తాగాడు. మత్తులో ఉన్న ఇర్ఫాన్​ను గుర్తించిన ఇస్లాంపురాకు చెందిన ఖుతుబొద్దీన్, సమీర్​లు బైక్​పై ఇంటికి తీసుకెళ్తామని నమ్మించారు. బైక్​పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతని వద్ద ఉన్న మొబైల్, రూ.700 నగదు తీసుకుని పారిపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఖుతుబొద్దీన్, సమీర్​లను అరెస్ట్ సీజ్​ చేయడం జరిగిందని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటే నమ్మి వాళ్లవెంట వెళ్లవద్దని ఏఎస్పీ సూచించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై బాల్ రెడ్డి పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...