అక్షరటుడే, ఇందూరు: TNGOs Nizamabad | ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను (government employees problems) పరిష్కరించాలని టీఎన్జీవోస్ అధ్యక్షుడు నాశెట్టి సుమన్, ప్రధాన కార్యదర్శి శేఖర్ కోరారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) శుక్రవారం కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయనకు విన్నవించారు.
వినతిపత్రం అందించిన వారిలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రెవెన్యూ ఫోరం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, సహాయ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, ఇందిరా, శ్రీవేణి, విజయలక్ష్మి, సునీల్, స్వామి, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి తదితరులున్నారు.