A320 Flights | ఏ320 విమానాల్లో సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ పూర్తి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : A320 Flights | భారత విమానయాన సంస్థలు వాడే ఏ320 విమానాల్లో సాఫ్ట్​వేర్ సమస్యను పరిష్కరించినట్లు డీజీసీఏ తెలిపింది. విమాన నియంత్రణలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను భారతీయ క్యారియర్‌లు (Indian Carriers) పూర్తి చేశాయని ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ఆదివారం ప్రకటించింది. సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా ఏ320 రకం ఫ్లైట్​లలో సాఫ్ట్​వేర్​ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో సాంకేతిక సమస్యలు నెలకొంటున్నాయి. దీంతో సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసుకోవాలని ఎయిర్​బస్​ కంపెనీ (Airbus […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : A320 Flights | భారత విమానయాన సంస్థలు వాడే ఏ320 విమానాల్లో సాఫ్ట్​వేర్ సమస్యను పరిష్కరించినట్లు డీజీసీఏ తెలిపింది. విమాన నియంత్రణలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను భారతీయ క్యారియర్‌లు (Indian Carriers) పూర్తి చేశాయని ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ఆదివారం ప్రకటించింది.

సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా ఏ320 రకం ఫ్లైట్​లలో సాఫ్ట్​వేర్​ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో సాంకేతిక సమస్యలు నెలకొంటున్నాయి. దీంతో సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసుకోవాలని ఎయిర్​బస్​ కంపెనీ (Airbus Company) తెలిపింది. దీంతో శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా వేలాది విమానాల రాకపోకల్లో ఆలస్యం నెలకొంది. భారత్​తో సహా ప్రపంచవ్యాప్తంగా 6 వేల ఎయిర్​ బస్​ విమానాలకు అప్​గ్రేడేషన్​ అవసరం అని తెలిపింది. దీంతో భారత్​లోని కంపెనీలు సాఫ్ట్​వేర్​లను అప్​డేట్ చేసుకున్నాయి.

A320 Flights | 338 విమానాలు

భారత్​లోని ఎయిర్​లైన్​ సంస్థల వద్ద ఏ320 రకానికి చెందిన 338 విమానాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 323 పని చేస్తున్నాయి. ఆరింటికి మరమ్మతులు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా (Air India) ఫ్లీట్‌లోని తొమ్మిది విమానాలకు అప్‌గ్రేడ్‌లు అవసరం లేదని తేలింది అని సీనియర్ DGCA అధికారి తెలిపారు. ఇండిగో A320 కుటుంబ విమానాలలోని 200 ఫ్లైట్​లకు అప్‌గ్రేడ్‌లను పూర్తి చేసింది. ఎయిర్ ఇండియా 113 విమానాలు దెబ్బతినగా.. 100 ఫ్లైట్​లకు సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 23 ప్లేన్​లు అప్‌గ్రేడ్‌లు జరిగాయి, అలాంటి రెండు విమానాలు తిరిగి డెలివరీ కోసం నిర్వహణలో ఉన్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...