HomeతెలంగాణSoftware Employee | తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్తూ.. ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్​వేర్ ఉద్యోగిని

Software Employee | తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్తూ.. ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్​వేర్ ఉద్యోగిని

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Software Employee | తండ్రికి బైక్ గిఫ్ట్(Bike Gift) ఇచ్చేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి(Hyderabad Gachibowli)లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న యశస్విని తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) బైకును గిఫ్ట్​గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేయాలనుకుంది. అయితే తోటి ఉద్యోగితో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్​పై బయలుదేరింది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యశస్విని మృతి చెందింది. కాగా.. యశస్విని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు. యశస్విని మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

Must Read
Related News