అక్షరటుడే, లింగంపేట : Panchayat elections | స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని ఎల్లారెడ్డి డీఎస్పీ (Yellareddy DSP) శ్రీనివాసరావు అన్నారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సోషల్ మీడియా లో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు పెట్టినా, వదంతులు వ్యాప్తి చేసినా వారిపై, గ్రూప్ అడ్మిన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, ప్రచారం చేసినా ఎన్నికల కోడ్ ఆధారంగా వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలకు సంబందించిన విధులు, బందోబస్తు గురించి సూచనలు చేసారు. ఈ సమావేశం లో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్ఎస్ నగర్ సీఐ సంతోష్, ఎస్సైలు మహేష్, భార్గవ్, దీపక్ కుమార్, నరేష్ , ఆంజనేయులు, పుష్పరాజ్ పాల్గొన్నారు.