HomeతెలంగాణSneha Society | వికలాంగులకు బాసటగా నిలుస్తోన్న ‘స్నేహ సొసైటీ’

Sneha Society | వికలాంగులకు బాసటగా నిలుస్తోన్న ‘స్నేహ సొసైటీ’

- Advertisement -

అక్షరటుడే ఇందూరు:Sneha Society | స్నేహ సొసైటీ 33ఏళ్లుగా సేవలందిస్తూ వికలాంగులకు బాసటగా నిలుస్తోందని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ తెలిపారు. ఆదివారం నగరంలోని మారుతి నగర్​లో Maruti Nagar ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ Sneha Society for Rural Reconstruction 33 వ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంధ విద్యార్థులు ఆయా రంగాల్లో ప్రావీణ్యాన్ని చూపిస్తున్నారని.. ఇందుకు స్నేహ సొసైటీ సిబ్బంది ఎంతో కష్టపడ్డారన్నారు.

అనంతరం ఉపాధ్యక్షురాలు డాక్టర్ సబితా రాణి మాట్లాడుతూ.. ఒక సంస్థను స్థాపించి సేవలు అందించాలంటే సామాజిక దృక్పథం ఎంతో అవసరమన్నారు. అంతకుముందు స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య వార్షిక నివేదికను సమర్పించారు. అలాగే జూలైలో నిర్వహించే పెర్ల్ సెలబ్రేషన్స్ సావనీర్ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ, ప్రోగ్రాం మేనేజర్ బాలరాజు, కార్యవర్గ సభ్యులు వీరేశం, శ్యాంసుందర్, సుధాకర్, బాబా గౌడ్, బ్రహ్మానందరెడ్డి, జీవన్​రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.