ePaper
More
    Homeబిజినెస్​Smarten Power Systems IPO | అదరగొట్టిన స్మార్టెన్‌ పవర్‌.. తొలిరోజే 51 శాతం లాభాలు

    Smarten Power Systems IPO | అదరగొట్టిన స్మార్టెన్‌ పవర్‌.. తొలిరోజే 51 శాతం లాభాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Smarten Power Systems IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic stock market)లో సోమవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో మెయిన్‌బోర్డునుంచి వచ్చిన ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్‌ (Travel food services) కంపెనీ నిరాశపరచగా.. ఎస్‌ఎంఈకి చెందిన స్మార్టెన్‌ పవర్‌ సిస్టమ్స్‌ భారీ లాభాలను అందించింది. కెమ్‌కార్ట్‌ ఇండియా స్వల్ప లాభాలలో లిస్టయ్యింది.

    Smarten Power Systems IPO | స్మార్టెన్‌ పవర్‌ సిస్టమ్స్‌ బంపర్ లిస్టింగ్..

    స్మార్టెన్‌ పవర్‌ సిస్టమ్స్‌ (Smarten power systems) మార్కెట్‌నుంచి రూ. 47.5 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో (IPO)కు వచ్చింది. ఒక్కో షేరు ధర రూ. 100. ఒక లాట్‌లో 1,200 షేర్లున్నాయి. కాగా ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ(NSE)లో 44 శాతం ప్రీమియంతో రూ. 144 వద్ద లిస్టయ్యాయి. ఆ తర్వాత మరో ఐదు శాతం పెరిగి రూ. 151 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఈ కంపెనీ తొలి రోజే ఇన్వెస్టర్లకు 51 శాతం లాభాల(Profits)ను అందించింది. అంటే ఈ కంపెనీ ఐపీవో అలాట్‌ అయినవారికి రూ. 61 వేల ప్రాఫిట్‌ వచ్చిందన్నమాట.

    Smarten Power Systems IPO | స్వల్ప లాభాల్లో కెమ్‌కార్ట్‌ ఇండియా..

    రూ. 75.96 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో కెమ్‌కార్ట్‌ ఇండియా(Chemkart India) ఐపీవోకు వచ్చింది. ఐపీవో ప్రైస్‌ ఒక్కో షేరుకు రూ. 248. ఒక లాట్‌లో 600 షేర్లున్నాయి. కంపెనీ షేర్లు సోమవారం బీఎస్‌ఈ(BSE)లో ఫ్లాట్‌గా లిస్టయ్యాయి. ఆ తర్వాత 4.5 శాతం పెరిగాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రూ. 258 వద్ద కొనసాగుతోంది.

    IPO | నిరాశపరిచిన ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్‌..

    మార్కెట్‌నుంచి రూ. 2 వేల కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో మెయిన్‌బోర్డుకు చెందిన ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఒక్కో ఈక్విటీ షేరు గరిష్ట ధర రూ. 1,100. కాగా ఈ కంపెనీ షేర్లు సోమవారం 2.27 శాతం ప్రీమియం(Premium)తో రూ. 1,125 వద్ద లిస్టయ్యాయి. వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 1.6 శాతం నష్టంతో రూ. 1,082 వద్ద కొనసాగుతోంది.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...