Homeబిజినెస్​Lava Phone | భారీ బ్యాటరీతో లావా నుంచి స్మార్ట్‌ ఫోన్‌.. వచ్చేనెలలో లాంచ్‌ అయ్యే...

Lava Phone | భారీ బ్యాటరీతో లావా నుంచి స్మార్ట్‌ ఫోన్‌.. వచ్చేనెలలో లాంచ్‌ అయ్యే అవకాశం

ప్రముఖ దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ అయిన లావా(Lava).. భారీ బ్యాటరీతో కొత్త మోడల్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. వచ్చేనెలలో లావా అగ్ని 4(Agni 4) మోడల్‌ లాంచ్‌ అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lava Phone | భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) తయారీ కంపెనీ అయిన లావా ఎక్కువగా బడ్జెట్‌ ఫోన్లను తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ మిడ్‌ రేంజ్‌లో కొత్త మోడల్‌ను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. 7000 ఎంఏహెచ్‌ (mAh) బ్యాటరీ సామర్థ్యంతో అగ్ని 4 మోడల్‌ తీసుకువస్తోంది.

ఇది గతంలో రిలీజ్‌ చేసిన అగ్ని 3కి అడ్వాన్స్‌డ్‌ మోడల్‌గా నిలవనుంది. ఈ మోడల్‌ విడుదల తేదీ, స్పెసిఫికేషన్స్‌ (Specification) అధికారికంగా ప్రకటించప్పటికీ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం స్పెసిఫికేషన్‌ ఇలా ఉండనున్నాయి. వాటి గురించి తెలుసుకుందామా..

  • 6.78 ఇంచ్‌ ఫుల్‌ హెచ్డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో (Display) తీసుకురానున్నారు. 1200 * 2652 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120 Hz రిఫ్రెష్‌ రేట్‌ కలిగి ఉండొచ్చు.
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 8340 ప్రాసెసర్‌ వినియోగించనున్నారు. ఇది ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌(OS) ఆధారంగా పనిచేస్తుంది.
  • వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌(MP) మెయిన్‌ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ సెన్సార్‌తో కూడిన డ్యుయల్‌ కెమెరా సెట్‌ అప్‌, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంటాయని భావిస్తున్నారు.
  • 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది 66w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేయనుంది.
  • 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25 వేల వరకు ఉండే అవకాశాలున్నాయి. వైట్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభించనుంది.
  • ఈ మోడల్‌ అమెజాన్‌తో (Amazon) పాటు లావా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.