Sriram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​లోకి స్వల్ప ఇన్​ఫ్లో

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​(Sriram Sagar Project)లోకి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. మొన్నటి వరకు లక్షల క్యూసెక్కుల వరద రాగా.. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఇన్​ఫ్లో పడిపోయింది. జలాశయంలోకి ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. కాకతీయ కాలువకు (Kakatiya canal) 5 వేల క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 200, సరస్వతి కాలువకు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో […]

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​(Sriram Sagar Project)లోకి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. మొన్నటి వరకు లక్షల క్యూసెక్కుల వరద రాగా.. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఇన్​ఫ్లో పడిపోయింది.

జలాశయంలోకి ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. కాకతీయ కాలువకు (Kakatiya canal) 5 వేల క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 200, సరస్వతి కాలువకు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 709 క్యూసెక్కులు పోతోంది. దీంతో మొత్తం ఔట్​ ఫ్లో 6,790 క్యూసెక్కులుగా ఉంది. ఇన్​ఫ్లో, ఔట్​ ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.05 టీఎంసీల నీరు ఉంది.

Sriram Sagar | నిజాంసాగర్​లోకి..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar Project) ప్రస్తుతం 10,950 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు రెండు వరద గేట్ల ద్వారా 9,750 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు 1200 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మట్టంతో నిండుకుండలా ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...