Skill development | కెరీర్‌కు కొత్త మార్గం.. ఉచిత కోర్సులతో భవిష్యత్తుకు భరోసా..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Skill development | మీ నైపుణ్యాలను పెంచుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువత తనని తాను తీర్చిదిద్దుకోవాలని కేంద్ర ప్రభుత్వం (central government) కృషి చేస్తోంది. దీనిలో భాగంగా, ప్రతిభావంతులైన యువతను గుర్తించి, ప్రోత్సహించడానికి స్కిల్ ఇండియా కాంపిటీషన్-2025ను (Skill India Competition-2025) ప్రకటించింది. ఈ పోటీల కోసం వివిధ స్కిల్ ట్రేడ్‌లలో ఆసక్తి ఉన్న ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. Skill development | పోటీలో పాల్గొనే అవకాశం: నమోదు చేసుకున్న […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Skill development | మీ నైపుణ్యాలను పెంచుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువత తనని తాను తీర్చిదిద్దుకోవాలని కేంద్ర ప్రభుత్వం (central government) కృషి చేస్తోంది.

దీనిలో భాగంగా, ప్రతిభావంతులైన యువతను గుర్తించి, ప్రోత్సహించడానికి స్కిల్ ఇండియా కాంపిటీషన్-2025ను (Skill India Competition-2025) ప్రకటించింది. ఈ పోటీల కోసం వివిధ స్కిల్ ట్రేడ్‌లలో ఆసక్తి ఉన్న ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Skill development | పోటీలో పాల్గొనే అవకాశం:

నమోదు చేసుకున్న అభ్యర్థులు జిల్లా స్థాయి నుంచి ప్రారంభించి, రాష్ట్ర, జాతీయ, చివరికి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

Skill development | ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి?

యువత డిమాండ్‌కు అనుగుణంగా వందలాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
కోడింగ్, కృత్రిమ మేధ (Artificial Intelligence), డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, కమ్యూనికేషన్, లీడర్‌షిప్ వంటి కోర్సులు ఉన్నాయి.

Skill development | కోర్సుల విధానం:

కోర్సుల ఆధారంగా మైక్రో ప్రోగ్రామ్‌లు (కొన్ని గంటలు) లేదా కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్‌లు (కొన్ని వారాలు/నెలలు) ఉంటాయి. వీడియో క్లాసులు, చర్చా కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, ప్రాక్టికల్ అసైన్‌మెంట్స్ వంటివి శిక్షణలో భాగం. చాలా కోర్సులు ఉచితంగా లభిస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుని, భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.

Skill development | ఎక్కడ దరఖాస్తు చేయాలి?

  • ఆసక్తిగల వారు skillindiadigital.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • నమోదు ప్రక్రియ : ముందుగా, వెబ్‌సైట్‌లో ఫోన్ నంబరు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
  • తరువాత, ఏ రంగంలో నైపుణ్యం పెంచుకోవాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.
  • అనంతరం వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
  • చివరగా, చిరునామా, విద్యార్హతలు, ఉద్యోగం వివరాలు వంటివి పొందుపరచాలి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...