Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | న్యూసెన్స్​ కేసులో ఆరుగురు మహిళలకు జైలుశిక్ష

Nizamabad City | న్యూసెన్స్​ కేసులో ఆరుగురు మహిళలకు జైలుశిక్ష

నగరంలోని బస్టాండ్​,రైల్వేస్టేషన్​ ప్రాంతాల్లో ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను ఆకర్షించేలా వ్యవహరిస్తూ.. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేలా వారు ప్రవర్తించడంతో అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | నగరంలో రాత్రివేళల్లో న్యూసెన్స్​ చేస్తున్న ఆరుగురు మహిళలకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి(SHO Raghupathi) తెలిపిన వివరాలు వెల్లడించారు.

జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో యువతను ఆకర్షించేలా వ్యవహరిస్తూ.. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్న ఆరుగురు మహిళలను పోలీసులను అరెస్ట్​ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి (Kamareddy), భైంసా (Bhainsa) ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలపై సిటీ పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

అనంతరం వారిని సోమవారం స్పెషల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పర్చగా ఒకరికి ఒకరోజు, మిగిలినవారికి రెండురోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ఎవరైనా న్యూసెన్స్‌ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే.. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు.