అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jaipur hospital | రాజస్థాన్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం జరగటంతో ఆరుగురు పేషంట్లు చనిపోగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రాజస్థాన్‌లోని Rajasthan ప్రసిద్ధ ప్రభుత్వ ఆస్పత్రి government hospital సవాయి మాన్ సింగ్ Sawai Man Singh (SMS) హాస్పిటల్ ట్రౌమా సెంటర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ట్రౌమా సెంటర్ ఇన్‌ఛార్జి డాక్టర్ అనురాగ్ ధాకడ్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ ప్రమాదం న్యూరో ఐసీయూలోని స్టోరేజ్ ఏరియాలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగినట్టు అనుమానిస్తున్నారు.
ప్రమాద సమయంలో ఐసీయూలో 11 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరణించిన ఆరుగురిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
Jaipur hospital | ఘోర ప్రమాదం..
మరణించిన వారిలో సికార్‌కు చెందిన పింటూ, జైపూర్ ఆంధీకి చెందిన దిలీప్, భరత్‌పూర్‌కు చెందిన శ్రీనాథ్, రుక్మిణి, ఖుర్మా, సాంగానేర్‌కు చెందిన బహదూర్ ఉన్నారు.
ట్రౌమా సెంటర్ Trauma center లో మరొక ఐసీయూలో 14 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఆసుపత్రి అంతస్తు అంతటా పొగ వేగంగా వ్యాపించి భయాందోళన సృష్టించింది.
అగ్ని, పొగ వల్ల ఐసీయూ ICU పరికరాలు, రక్త నమూనా ట్యూబులు, ఇతర ముఖ్యమైన వస్తువులు దగ్ధమయ్యాయి. ఆసుపత్రి సిబ్బంది, రోగుల కుటుంబ సభ్యులు సహాయకులతో కలిసి రోగులను భవనం వెలుపలకి తరలించి రక్షణ చర్యలు చేపట్టారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. వార్డు దట్టమైన పొగతో నిండిపోయి ఉండగా, మంటలను ఆర్పేందుకు భవనంలోని కిటికీలు Windows పగలగొట్టాల్సి వచ్చింది.
ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న వెంటనే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోగారం పటేల్, హోం శాఖ సహాయమంత్రి జవహర్ సింగ్ బేధమ్ ట్రౌమా సెంటర్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
బాధితుల కుటుంబాలకు సరైన సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సిబ్బంది ప్రవర్తనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద సమయంలో సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కొంత మంది రోగుల సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.