అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని గతంలోనే ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. అలాగే యజమానులకు సైతం కౌన్సెలింగ్ (Police Counseling) ఇచ్చారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మద్యం సిట్టింగ్లు ఏర్పాటు చేసి న్యూసెన్స్ చేస్తున్నారు.
Gandhari | గాంధారి మండల కేంద్రంలో..
మండల కేంద్రంలో ఓ దాబాలో సిట్టింగ్ ఏర్పాటు చేసినందుకు దాబా (Dhaba sitting) యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. దాబాల్లో మద్యం అమ్మరాదని ఇదివరకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అయినప్పటికీ సిట్టింగ్లు ఏర్పాటు చేశారనే సమాచారంతో దాడి చేశామన్నారు. అనంతరం యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.