అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | పట్టణంలో కోర్టు ఏర్పాటు కోసం ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఈ మేరకు పలు భవనాలను జిల్లా జడ్జి భరత లక్ష్మి (District Judge Bharatha Lakshmi) శనివారం పరిశీలించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో, ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించి ఈ రెండు భవనాలు అనువుగా ఉన్నాయన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఏర్పాటు కోసం భవనాలను పరిశీలించామని జిల్లా జడ్జి పేర్కొన్నారు. ఈ రెండు భవనాల వివరాలను హైకోర్టుకు (High Court) అందజేస్తామన్నారు. భవనం ఎంపిక పూర్తయితే త్వరలోనే భీమ్గల్లో కోర్టు ప్రారంభం కానుందని ఆమె వివరించారు. ఆమె వెంట ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ఏడీఎం కోర్టు జడ్జి భవ్యశ్రీ, తహశీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, నాయకులు కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, బొదిరే స్వామి, జేజే నర్సయ్య, న్యాయవాదులు సురేష్, చైతన్య, గోలి నరేష్, ప్రకాష్, భూమన్న తదితరులు ఉన్నారు.
