Homeక్రీడలుDelhi Test | ఢిల్లీ టెస్ట్: వెస్టిండీస్ ఆఖరి వికెట్ కోసం చెమ‌టోడ్చిన‌ టీమిండియా... ఔట‌వ్వాలంటూ...

Delhi Test | ఢిల్లీ టెస్ట్: వెస్టిండీస్ ఆఖరి వికెట్ కోసం చెమ‌టోడ్చిన‌ టీమిండియా… ఔట‌వ్వాలంటూ సిరాజ్ హెచ్చ‌రిక

Delhi Test | ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు భారత జట్టుని కష్టపెట్టారు. చివరి వికెట్ భాగస్వామ్యం భారత్‌కు తలనొప్పిగా మారింది. మొహమ్మద్ సిరాజ్ ఫన్నీగా హెచ్చరించినప్పటికీ జస్టీన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ కష్టపడి ప‌రుగులు చేసి భార‌త్‌కి 121 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది వెస్టిండీస్.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi Test | ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ West Indies బ్యాటర్లు భారత బౌలర్లని కష్టపెట్టారు. చివరి వికెట్ భాగస్వామ్యం భారత్‌ Team India కు తలనొప్పిగా మారింది.

మొహమ్మద్ సిరాజ్ ఫన్నీ హెచ్చరిక ఇచ్చినప్పటికీ, జస్టీన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ కష్టపడి ప‌రుగులు చేసి భార‌త్‌కి 121 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది వెస్టిండీస్.

ఢిల్లీ టెస్ట్‌లో ఫాలో-ఆన్ ఆడిన‌ వెస్టిండీస్ west indies బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్క‌లు చూపించారు. మొదట టీమిండియా సునాయాసంగా విజ‌యం సాధిస్తుందంటూ అందరూ భావించినప్పటికీ, వెస్టిండీస్ ఆటగాళ్లు పోరాట ప‌టిమ‌ను కనబరిచారు.

షై హోప్‌, జాన్ క్యాంప్‌బెల్‌లు శతకాలు బాది, జట్టును తిరిగి పోరాటంలోకి తీసుకువచ్చారు. నాలుగో రోజు మధ్యాహ్నాం వ‌ర‌కు విండీస్ ప్యాక్ అప్ అవుతుంది అనుకుంటే, చివరి వికెట్ జస్టిన్ గ్రీవ్స్‌, జేడెన్ సీల్స్ భారత్ బౌలర్లకు తలనొప్పి తెచ్చిపెట్టారు.

ఈ ఇద్దరూ కలసి ఆఖరి వికెట్‌లో 79 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించి, జట్టుకి కీలక పరుగులు అందించారు.

Delhi Test | కూల్ వార్నింగ్..

ఈ సందర్భంలో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ Mohammed Siraj రంగంలోకి దిగాడు. గ్రీవ్స్ వద్దకు వెళ్లి చిరునవ్వుతోనే “ఇక ఆపేయండి” అనే ఫన్నీ హెచ్చరిక ఇవ్వ‌గా, ఇందుకు సంబంధించిన‌ వీడియో కెమెరాలకు చిక్కింది.

సోషల్ మీడియాలో ఈ ఇన్సిడెంట్ వైరల్‌గా మారింది. అయితే, సిరాజ్ హెచ్చరికను పెద్దగా పట్టించుకోని జస్టిన్ గ్రీవ్స్ తన ఫిఫ్టీని పూర్తి చేసి, 85 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. మ‌రోవైపు జేడెన్ సీల్స్ 32 పరుగులు చేయ‌డంతో భార‌త ల‌క్ష్యం కాస్త పెరిగింది.

రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు మొత్తం 390 పరుగులు చేసింది. దాంతో భారత్‌ 121 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. నాల్గో రోజు ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 25, సాయి సుదర్శన్ 30 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

భారత జట్టు విజయం సాధించాలంటే ఐదో రోజు 58 పరుగులు చేయాల్సి ఉంది. లంచ్‌కి ముందే మ్యాచ్ ముగిసే అవ‌కాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ త‌న అద్భుత‌మైన బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాద‌వ్ Kuldeep Yadav, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసాడు. కుల్దీప్‌కి మిగ‌తా బౌల‌ర్స్ కూడా స‌పోర్ట్ అందించ‌డంతో వెస్టిండీస్‌ని త‌క్కువ స్కోరుకి ప‌రిమితం చేశారు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో భార‌త బ్యాట్స్‌మెన్ య‌శ‌స్వి జైస్వాల్ సునామి ఇన్నింగ్స్ ఆడాడు. 175 ప‌రుగులు చేసి ర‌నౌట్ ఔట‌య్యాడు. మ‌రోవైపు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కం బాదాడు. రెండో టెస్ట్ కూడా భార‌త్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ కానుంది. మొత్తానికి గిల్ కెప్టెన్సీలో భార‌త్ దూసుకుపోతుంది.