అక్షరటుడే, ఇందూరు: sinusitis | ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు, కాలుష్యం, దుమ్ము, అలర్జీలు పెరగడం వల్ల సైనసైటిస్ సమస్య అనేక మందిని వేధిస్తున్నట్లు నిజామాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన ఈఎన్‌టీ సర్జన్ ENT surgeon డా. అలోక్ పేర్కొన్నారు.
సైనసైటిస్ అనేది ముక్కులో ఉన్న సైనస్ గుహల్లో ఇన్ఫెక్షన్, వాపు ఏర్పడటం వల్ల వచ్చే వ్యాధి. దీని కారణంగా ముక్కు బ్లాక్ అవడం, ముక్కులో నుంచి నీరు కారడం, తలనొప్పి, ముఖ భాగంలో నొప్పి, కళ్ల చుట్టూ వాపు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు symptoms కనిపిస్తాయి. కొంత మందిలో దీర్ఘకాలంగా కొనసాగితే నిద్రలేమి, అలసట కూడా ఏర్పడుతుందని వైద్యుడు తెలిపారు.
sinusitis | ప్రధాన కారకాలు ఇవే..
సైనసైటిస్‌కు ప్రధాన కారణాలుగా జలుబు పూర్తిగా నయం కాకపోవడం, అలర్జీలు, పొగ తాగడం, ధూళి–కాలుష్యానికి ఎక్కువగా గురికావడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అంశాలని డాక్టర్ వివరించారు. ప్రారంభ దశలో సరైన వైద్య చికిత్స తీసుకుంటే సైనసైటిస్‌ను పూర్తిగా నియంత్రించవచ్చని చెప్పారు.
సైనసైటిస్ చికిత్సలో మందులతో పాటు అవసరమైతే ఆధునిక ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్వయంగా మందులు వాడటం, నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సైనసైటిస్ నివారణకు పరిశుభ్రత పాటించాలి.. ధూళి ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ధరించాలి.. చల్లని పానీయాలను తగ్గించాలి.. అలర్జీ కారకాలను దూరంగా ఉంచాలి.. జలుబు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని డా. అలోక్ సూచించారు. సైనసైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే అర్హత కలిగిన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలని ఆయన చెప్పుకొచ్చారు.