HomeUncategorizedYS Jagan | జగన్​ కారు కింద పడడంతోనే సింగయ్య మృతి.. వీడియో వైరల్​

YS Jagan | జగన్​ కారు కింద పడడంతోనే సింగయ్య మృతి.. వీడియో వైరల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్ (YS Jagan)​ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల (Rentapalla)లో ఇటీవల ఆయన పర్యటించిన విషయం తెలిసిందే. గ్రామ ఉపసర్పంచ్​ నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అయితే ఆయన పర్యటనలో వాహనం కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

జగన్ కాన్వాయ్ వాహనం కాకుండా వేరే వాహనం తగిలి ప్రమాదంలో సింగయ్య చనిపోయాడని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ (SP Satheesh Kumar) గతంలో తెలిపారు. ఓ ప్రైవేట్ వెహికల్ టాటా సఫారీ గుద్ది ఆపకుండా వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. అయితే జగన్​ పర్యటిస్తున్న కారు ఢీకొనడంతోనే ఆయన చనిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు సోషల్​ మీడియాలో వీడియో వైరల్​ అవుతోంది. ఓ వైపు జగన్​ జనాలకు అభివాదం చేస్తుండగా.. మరోవైపు అదే కారు టైరు కింద సింగయ్య నలిగిపోయాడు. దీంతో జగన్ ర్యాలీలోని వాహనాల వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.