19
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి (Yellareddy) మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా సిద్ధిశ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి (Election Officer) దిగంబర్ తెలిపారు. అధ్యక్ష పదవికి సిద్ది శ్రీధర్, ముత్యపు కిరణ్ ఇద్దరు నామినేషన్లు వేయగా ముత్యపు కిరణ్ నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో శ్రీధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్య వైశ్య సంఘం (Arya Vaishya Sangham)జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలగేషన్, జిల్లా కార్యదర్శి ముత్యపు సుదర్శన్ తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.