అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heart Attack | హైదరాబాద్ (Hyderabad)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఓ ఎస్సై మృతి చెందాడు. పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ఆయన కుప్పకూలాడు.
నాచారం (Nacharam)లో నివాసం ఉండే సంజయ్ సావంత్ (58) ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండటంతో మంగళవారం రాత్రి ఆయన పోలీస్ స్టేషన్లోనే నిద్రించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలారు. కానిస్టేబుల్స్ వెంటనే ఎస్సైని సమీపంలోని కామినేని ఆస్పత్రి (Kamineni Hospital)కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సంజయ్ రెండేళ్లుగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ (LB Nagar Police Station)లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. 1989లో కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయిన ఆయన ఇటీవల ఎస్సైగా ప్రమోషన్ పొందారు. ఎస్సై మృతిపై పోలీస్ సిబ్బంది, అధికారులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
