HomeతెలంగాణACB | రూ.10 వేలకు కక్కుర్తిపడి.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

ACB | రూ.10 వేలకు కక్కుర్తిపడి.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB : రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఎంత మంది అధికారులు ఏసీబీ(ACB)కి పట్టుబడుతున్నా.. లంచాలకు మరిగిన వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా లంచం (Bribe Taking) తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి దొరికాడు.

నాగర్​ కర్నూల్​ జిల్లా (Nagar Kurnool district) కల్వకుర్తి పోలీస్​ స్టేషన్ (Kalvakurthi Police Station) లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జమాల్​పురి రాంచందర్​జీ రూ.10 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. ఫిర్యాదుదారుడిపై నమోదైన కేసులో స్టేషన్​ బెయిల్​ ఇవ్వడానికి సదరు ఎస్సై రూ.పది వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆనిశా అధికారులు వల పన్ని అవినీతి పోలీసు అధికారిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB : సిరులు కురిపిస్తున్న స్టేషన్​ బెయిల్​

కొందరు పోలీసు అధికారులు ఇటీవల అన్నింటా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్టేషన్​ బెయిల్​ విషయంలో మరీ బరి తెగిస్తున్నారనే వాదన ఉంది. స్టేషన్​ బెయిల్​ ఇచ్చేందుకు కొందరు పోలీసు అధికారులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తున్నారనే అభియోగాన్ని తాజా ఘటన నిజం చేస్తోంది.

ACB : లంచం అడిగితే ఫిర్యాదు చేయండి

ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.