అక్షరటుడే, నందిపేట్ : Local Body Elections | మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) కోలాహలం మొదలైంది. మూడోవిడతలో భాగంగా బుధవారం పలువురు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా లక్కంపల్లి (Lakkampally village) సర్పంచ్ పదవికి శ్యాంరావు నామినేషన్ వేశారు.
శ్యాంరావు మాట్లాడుతూ.. లక్కంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అవినీతి నుంచి అభివృద్ధి వైపు గ్రామాన్ని నడిపిస్తానని వెల్లడించారు.
