అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shreyas Iyer | టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న సమయంలో, అభిమానులను కలుస్తూ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న శ్రేయస్‌పై ఒక పెంపుడు కుక్క అకస్మాత్తుగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది. అదృష్టవశాత్తూ, శ్రేయస్ చూపిన అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
Shreyas Iyer | కుక్క కరవబోతే..
ఎయిర్‌పోర్ట్ Airport నుంచి బయటకు వస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్‌ను చూసిన అభిమానులు చుట్టుముట్టారు. ఆ సమయంలో ఒక యువ అభిమానికి ఆయన చిరునవ్వుతో ఆటోగ్రాఫ్ ఇస్తుండగా, అక్కడే ఉన్న ఓ మహిళ తన పెంపుడు కుక్కతో ముందుకు వచ్చింది. అది ఇండియన్ స్పిట్జ్ జాతికి చెందిన తెల్లటి కుక్కగా తెలుస్తోంది. స్నేహపూర్వకంగా స్పందించిన శ్రేయస్, ఆ కుక్కను (dog) నిమరడానికి చేయి చాచిన క్షణాల్లోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కుక్క అకస్మాత్తుగా అతని చేతిని కరవడానికి ప్రయత్నించింది. క్షణాల్లో పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రేయస్ మెరుపు వేగంతో తన చేతిని వెనక్కి లాక్కోవడంతో కాటు నుంచి తప్పించుకున్నాడు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఆ మహిళ కుక్కను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటన చిన్నదిగా అనిపించినా, శ్రేయస్ కెరీర్ పరంగా ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉండేది. గతేడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తున్న శ్రేయస్‌కు ఇది కీలక దశ. జనవరి 11 నుంచి వడోదరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో (Odi Series) ఆయన కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
ఒకవేళ బ్యాటింగ్ చేసే చేతికి గాయం అయ్యుంటే, అది కేవలం ఈ సిరీస్‌కే కాకుండా ఆయన కెరీర్‌పైనే ప్రభావం చూపించే పరిస్థితి ఉండేది. ఇదిలా ఉండగా, శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టుతో పాటు టీ20 జట్టులోకి కూడా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ గాయం కారణంగా తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండటంతో, ఆ స్థానాన్ని శ్రేయస్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మైదానంలోకి అడుగుపెట్టకముందే ఎదురైన ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.