Hyderabad Mall Fire | షాపింగ్​మాల్​లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్​ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్‌ 36లోని మంగళగౌరి షాపింగ్​మాల్‌లో మంటలు అంటుకున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్:Hyderabad Mall Fire | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఓ షాపింగ్​ మాల్​లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్‌ 36లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మెట్రోస్టేషన్ సమీపంలోని మంగళగౌరి షాపింగ్​మాల్‌ (Mangalaguri Shopping Mall)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం మాల్ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రస్తుతం షాప్​ నడవడం లేదని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరమ్మతులు పనులు కొనసాగుతుండటంతో నలుగురు కార్మికులు లోపల చిక్కుకున్నారని, వారిని బ్యాక్​ డోర్​ ద్వారా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా నగరంలో ఇటీవల అగ్నిప్రమాదాలు (Fire Accident) ఆందోళన కలిగిస్తున్నాయి. గతతంలో బచ్చాస్​ ఫర్నిచర్​ షోరూమ్​లో మంటలు అంటుకొని ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కూకట్​పల్లిలోని ఓ బైక్​ షోరూంలో మంటలు అంటుకున్నాయి. అంతకుముందు అత్తాపూర్​లో కార్ల షోరూమ్​ (Car Showroom)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు కాలిపోయాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...