అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Shoyu Restaurant | సాధారణంగా సెలబ్రిటీల రెస్టారెంట్స్ అంటే అవి చాలా నీట్‌గా, ఫుడ్ కూడా హైజెనిక్‌గా ఉంటుందని మనం విశ్వసిస్తుంటాం. అయితే అనుకోకుండా ఆ ఫుడ్ కాస్త అశుభ్రంగా ఉంటే మాత్రం నిప్పులు చెరగడం ఖాయం.
ఇప్పుడు నాగ చైతన్య షోయూ రెస్టారెంట్‌పై కొందరు నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని హీరో నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నాడు. రీసెంట్‌గా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. హైదరాబాదులో క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ ని షోయూ పేరుతో ప్రారంభించగా.. ఇది ఓ జపనీస్ రెస్టారెంట్(Japanese Restaurant).. ఇందులో ఎన్నో చైనీస్ ఫుడ్ మెనూ ఉంటుంది. భారతీయ వంటకాలలో కనిపించని ఎన్నో వంటకాలు ఈ మెనూలో కనిపిస్తాయి..
Shou Restaurant | ఇంత దారుణం ఏంటి?
అలా ప్రపంచంలో ఉండే ఎన్నో రకాల రుచికరమైన ఆహారాలు ఈ రెస్టారెంట్లో(Restaurant) దొరుకుతాయి. అలా స్విగ్గి, జోమాటోలతో ఈ షోయూ రెస్టారెంట్ నుండి ఎంతోమంది ఫుడ్ ని ఆర్డర్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా నాగచైతన్య షోయూ Shoyu చైనీస్ వంటకంపై ఒక నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. ఓ నెటిజన్ షోయూ నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అందులో బొద్దింక(Cockroach) వచ్చింది. ఫుడ్ ఆర్డర్లో బొద్దింక రావడంతో దీన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సంచలన పోస్ట్ చేశారు. దీంతో ఆ నెటిజన్ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు నాగచైతన్య షోయూ రెస్టారెంట్(Naga Chaitanya Shoyu Restaurant)లో కూడా ఫుడ్ విషయంలో ఇంత అజాగ్రత్తనా అంటూ మండిపడుతున్నారు.
కస్టమర్(Customer)కి ఇలాంటి ఆహారం పంపిస్తారా.. అందరి రెస్టారెంట్లలో ఉన్నట్లే నాగచైతన్య షోయూ రెస్టారెంట్లో కూడా నాణ్యతలేని, పరిశుభ్రత లేని ఆహారాలను అందిస్తున్నారా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇటీవల జపాన్‌లో దేవర సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ NTR షోయూ రెస్టారెంట్, అక్కడి ఫుడ్‌పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. నెటిజన్ పెట్టిన పోస్ట్ నాగచైతన్య వ్యాపారాన్ని దెబ్బతీసేలానే ఉంది.. ఈ ఒక్క పోస్టు సోషల్ మీడియాని షేక్ చేయడంతో షోయూ యాజమాన్యం లేదంటే నాగ చైతన్య కాని స్పందిస్తారా..? అనేది చూడాలి.