అక్షరటుడే, ఇందూరు: Nizamabad market : దుకాణాలను రాత్రి వేళ 11:30 గంటల వరకు తెరిచి ఉంచుతామని, అనుమతి ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ నగరంలోని వ్యాపారులు ఏఐఎంఐఎం Aimim ఆధ్వర్యంలో సీపీ సాయి చైతన్యకు cp sai Chaitanya వినతిపత్రం అందజేశారు.
నిజామాబాద్ మార్కెట్‌ను మూసివేసేందుకు ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు పోలీసు వాహనం గస్తీ తిరుగుతోందని, శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ప్రధానమైనప్పటికీ.. ఈ చర్య ప్రజలు, చిన్న వ్యాపారులకు, స్టాల్స్ హోల్డర్‌లకు, హోటళ్లు, ఫుడ్ కోర్టులు, చిరు వ్యాపారులకు చాలా సవాళ్లను కలిగిస్తోందని వాపోయారు.
మార్కెట్ ను రాత్రి 10:30 గంటలకు ముందుగానే మూసివేయడం వల్ల చాలా మంది పౌరులు, ముఖ్యంగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేవారు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేకపోతున్నారని వ్యాపారులు పేర్కొన్నారు. సంబంధిత స్టేషన్ల పోలీసు అధికారులు రాత్రి 10:00 గంటలకే మూసివేయిస్తున్నారని తెలిపారు.
వాహన తనిఖీలు, పోలీసు పెట్రోలింగ్‌తో యువకులు తప్ప.. ఇతరులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ముఖ్యంగా వివాహ కార్యక్రమాలకు, వైద్య అత్యవసర పరిస్థితులకు వచ్చి వెళ్లేవారు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
పరిమితం చేయబడిన మార్కెట్ వేళల వల్ల చిన్న వ్యాపారులు వ్యాపారం నడవక ఆర్థికంగా చితికిపోతున్నారని వాపోయారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట రాత్రి వేళ గడువును 10:30 PM నుంచి 11:30 PM కి పొడిగించాలని కోరారు.