ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    Published on

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​ చేయడంతో ఆమె అనుచరులు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.

    Maggari Hanmandlu | తాజాగా నాళేశ్వర్​ గ్రామం నుంచి..

    బోధన్ నియోజకవర్గం (Bodhan Constituency) నవీపేట్ (navipet) మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన సొసైటీ ఛైర్మన్ మగ్గరి హన్మాండ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ లేఖను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు పంపారు.

    Maggari Hanmandlu | జాగృతితోనే నా ప్రయాణం అంటూ..

    ఈ సందర్భంగా మగ్గరి హన్మాండ్లు మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెంటే తాను ఉంటానని ఆయన పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితం బీఆర్​ఎస్​ నుంచి కవితను సస్పెండ్​ చేయడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కవితను అన్యాయంగా బీఆర్​ఎస్​ నుంచి తొలగించారని.. అందుకే కవిత వెంటే ఉండేందుకు బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పినట్లు తెలిపారు.

    కాగా కాళేశ్వరం అవినీతిలో హరీశ్​రావు, సంతోష్​రావు పాత్ర ఉందని కవిత ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు. అనంతరం ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో జిల్లాలోని ఆమె అనుచరులు బీఆర్​ఎస్​ను వీడుతున్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...