Shankar Bhavan | పీఎంశ్రీ నిధులతో శంకర్ భవన్ అభివృద్ధి: ఎమ్మెల్యే

అక్షరటుడే, ఇందూరు:Shankar Bhavan | కేంద్ర ప్రభుత్వం(Central Government) అందజేస్తున్న పీఎంశ్రీ నిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల(Shankar Bhavan School) అభివృద్ధి జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. మంగళవారం పాఠశాల వార్షికోత్సవానికి school anniversary హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, నాణ్యతను మెరుగుపర్చడానికి పీఎంశ్రీ పథకం(PMShri scheme) కింద గతేడాది రూ.27లక్షలు, అటల్ టింకరింగ్ ల్యాబ్(Atal Tinkering Lab) కోసం రూ.10 […]

అక్షరటుడే, ఇందూరు:Shankar Bhavan | కేంద్ర ప్రభుత్వం(Central Government) అందజేస్తున్న పీఎంశ్రీ నిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల(Shankar Bhavan School) అభివృద్ధి జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. మంగళవారం పాఠశాల వార్షికోత్సవానికి school anniversary హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, నాణ్యతను మెరుగుపర్చడానికి పీఎంశ్రీ పథకం(PMShri scheme) కింద గతేడాది రూ.27లక్షలు, అటల్ టింకరింగ్ ల్యాబ్(Atal Tinkering Lab) కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించామన్నారు.

మన ఊరు – మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల పథకాలు (Amma Adarsh ​​Schools Schemes) పేరుకే పరిమితమవుతున్నాయన్నారు. అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించడమే తన లక్ష్యమన్నారు. భవిష్యత్తులో శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి తన ట్రస్ట్(Trust)​ ద్వారా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ deo nizamabad Ashok, ఎంఈవో సాయ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లేశం, రామచందర్, టీపీటీఎఫ్ నాయకుడు వెనిగళ్ల సురేష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...