Homeతాజావార్తలుShamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత.. ఇండిగో తీరుతో ఆందోళ‌న‌కి దిగిన అయ్య‌ప్ప...

Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత.. ఇండిగో తీరుతో ఆందోళ‌న‌కి దిగిన అయ్య‌ప్ప స్వామి భ‌క్తులు

Shamshabad Airport | శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్త‌ పరిస్థితులు నెలకొన్నాయి. శంషాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం 12 గంటలకుపైగా ఆలస్యమవడంతో ప్రయాణికులు, ప్రత్యేకంగా శబరిమలకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Shamshabad Airport | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం Shamshabad International Airport లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది.

శుక్రవారం ఉదయం కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో Indigo విమానం 12 గంటలకుపైగా ఆలస్యమవడంతో ప్రయాణికులు, ప్రత్యేకించి శబరిమల Sabarimala కు వెళ్లాల్సిన అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విమానాల ఆలస్యం, రద్దు, అలాగే సమయానికి సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బంది పట్ల భక్తులు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్–కొచ్చి ఇండిగో ఫ్లైట్ గురువారం సాయంత్రం బయలుదేరాల్సి ఉంది.

కాగా, విమాన ఆలస్యంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం కూడా విమానం బయలుదేరకపోవడంతో అయ్యప్ప భక్తులు Ayyappa devotees బోర్డింగ్ గేట్ వద్దే ఆందోళన చేపట్టారు.

Shamshabad Airport | మూడు రోజులుగా అదే కథ..

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రయాణికుల సమస్యలపై స్పందించాలని వారు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని గట్టిగా ప్రశ్నించారు.ఇది ఒక్కరోజు సమస్య మాత్రమే కాదు. బుధవారం, గురువారం, శుక్రవారం Friday ఇలా మూడు రోజులుగా శంషాబాద్ నుండి కేరళకు వెళ్లే ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, గంటల కొద్దీ ఆలస్యం కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

బుధవారం ఉదయం 9.40కి రావాల్సిన విమానం ఎంతసేపైనా రాకపోవడంతో అయప్ప భక్తులు గంటలతరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఆలస్యానికి గల కారణాలను సిబ్బంది వెల్లడించకపోవడం కూడా భక్తుల్లో అసహనాన్ని పెంచింది.

యాత్ర కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్న భక్తుల ప్రయాణం ఇండిగో IndiGo flights నిర్వహణ లోపాలతో పూర్తిగా దెబ్బతింది. “ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు చేస్తారా? కనీసం కారణాలు చెప్పకపోవడమేంటి?” అని వారు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు.

IndiGo విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే ప్రత్యేక విమానం నడపాలని కూడా భక్తులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎయిర్‌పోర్ట్ Airport అధికారులు అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు.

ప్రయాణికులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, నిర్లక్ష్యం, అసౌకర్యం పెరగడంతో ఉద్రిక్తత కొంతసేపు కొనసాగింది. భక్తులు ఎయిర్‌లైన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

Must Read
Related News