అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shalini Pandey | టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అదృష్టం దక్కితే ఆ నటికి వరుస ఆఫర్లు వచ్చేస్తాయి, కెరీర్ వేగంగా ఎదుగుతుంది.
కానీ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) అనే బ్లాక్ బస్టర్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా, హీరోయిన్ షాలిని పాండే మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. విజయదేవరకొండ సరసన నటించిన డెబ్యూ చిత్రంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తర్వాత ఆమె కెరీర్ ఆశించినంతగా రాణించలేకపోయింది. ఆ సినిమా తరువాత పెద్ద ఆఫర్లు రాకపోవడం, ఆమె పోషించిన పాత్ర ఇమేజ్ కారణమా లేక మరేదైనా కారణమా అన్న చర్చలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
Shalini Pandey | బాగా తగ్గింది..
అందం, అభినయం రెండూ ఉన్నా, షాలినికి Shalini Pandey దక్కాల్సిన స్టార్ ఇమేజ్ రాలేదని అభిమానులు సోషల్ మీడియాలో తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఆమె ఫాలోవర్స్ మాత్రం “ఎప్పటికైనా వరుస ఆఫర్లు రావాల్సిందే” అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ షేర్ చేసే ఫోటోషూట్స్ (photoshoots), వీడియోలతో షాలిని పాండే ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వైట్ ఔట్‌ఫిట్ ఫోటోలు ఘనంగా వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ వైట్ డ్రెస్, ఆకట్టుకునే ఫిజిక్, క్లాసీ లుక్ చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొద్దిగా బక్కచిక్కినట్టుగా కనిపించినా, “చిక్కినా చక్కన్నమ్మే” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఫోటోలు వైరల్ Viral కావడంతో మళ్లీ ఒకసారి షాలిని పాండే అందంపై చర్చ మొదలైంది. కానీ సోషల్ మీడియా (social media) క్రేజ్ సినిమాల్లో ఆ అవకాశాలు మాత్రం రాలేదని అభిమానులు బాధపడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ధనుష్ హీరోగా నటించిన ‘ఇడ్లీ కడై’లో షాలినికి ముఖ్యమైన పాత్ర లభించింది. హీరోయిన్ రోల్‌కు ఏమాత్రం తగ్గకుండా నటించి ఆకట్టుకున్నా, ఆ పాత్రలో కొద్దిగా నెగటివ్ షేడ్స్ ఉండటం విశేషం.
అంతకుముందు విడుదలైన ‘మహారాజ్’ సినిమాలో (Maharaj Movie) ఆమె పాత్ర పరిమితంగా ఉండటంతో పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. కొన్నిసార్లు ఆఫర్లు వచ్చినా, అవి ఆశించిన స్థాయి ఫేమ్ ఇవ్వకపోవడంతో ఆమె కెరీర్ స్పీడు అందుకోలేకపోయిందనే భావన అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం షాలిని పాండే నటిస్తున్న ‘రాహు కేతువు’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా అయినా ఆమెకు కావాల్సిన గుర్తింపు, స్టార్‌డమ్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.