అక్షరటుడే, వెబ్‌డెస్క్: B.Ed College : ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక కాలేజీలోనే విద్యార్థిని నిప్పంటించుకున్న ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశా Odisha రాష్ట్రంలోని బాలాసోర్ Balasore జిల్లా కేంద్రంలో ఉన్న ఫకీర్ మోహన్ కాలేజీ Fakir Mohan Collegeలో ఈ దారుణ ఘటన జరిగింది.
సమీర్ కుమార్ అనే HOD తనను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆవేదనతో బీఈడీ Bed సెకండ్ ఇయర్ విద్యార్థిని B.Ed student పెట్రోల్ Petrol పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి ఒంటిపై 90% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
B.Ed College : పట్టించుకోని యాజమాన్యం..
కాగా, ఉపాధ్యాయుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని జూన్ 30వ తేదీన కాలేజీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి బాధిత యువతి ఫిర్యాదు చేసింది. కానీ, పక్షం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా యాజమాన్యం management నిర్లక్ష్యం వహించింది.
యాజమాన్యం నాన్చుడు ధోరణితో విసిగిపోయిన బాధితురాలు తోటి విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ Principal దిలీప్ ఘోష్ ఛాంబర్ ఎదుట నిరసన కూడా చేపట్టింది. అయినా, స్పందన లేకపోవడంతో ఆవేదనతో విద్యార్థిని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.