అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | ఫుట్‌పాత్(foot path)పై నిద్రిస్తున్న ఇద్దరిని విద్యుత్ తీగ బలిగొంది. ప్రశాంతంగా పడుకున్న వారిపై కరెంట్ వైర్ తెగిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్(LB Nagar) పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఎల్బీ నగర్ పరిధిలోని చింతలకుంట(Chintalakunta) రోడ్డు సాగర్ రిండ్ రోడ్డు వద్ద ఎల్లమతల్లి ఆలయం సమీపంలో ఇద్దరు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నారు. ఒక మహిళ, ఒక పురుషుడు పడుకొని ఉండగా.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విద్యుత్ తీగ తెగి వారిపై పడింది. దీంతో విద్యుత్ షాక్ తో వారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ(osmaniya hospital mortuary)కి తరలించారు. వారి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, యాచకులు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.