Homeజిల్లాలునిజామాబాద్​Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి జైలుశిక్ష

Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి జైలుశిక్ష

డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పలువురికి జైలుశిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. నిజామాబాద్​ నగరంతో పాటు ఆర్మూర్​ న్యాయస్థానాల్లో జడ్జిలు జైలుశిక్షతో పాటు భారీగా జరిమానాలు విధించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ/ఆర్మూర్​/బాల్కొండ : Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన పలువురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. నిజామాబాద్​ (Nizamabad) నగరంతో పాటు ఆర్మూర్​లో న్యాయస్థానాల్లో మంగళవారం న్యాయమూర్తులు జైలుశిక్షతో పాటు భారీగా జరిమానాలు విధించారు.

Drunk Drive | నిజామాబాద్​ నగరంలో..

నిజామాబాద్​ ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో పలుచోట్ల డ్రంకన్​డ్రైవ్​ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 35 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్​ నిర్వహించి సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ నూర్జహాన్​ ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి 17 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. అలాగే ఒకరికి రూ.11,000 జరిమానా విధించారు. మరో ఏడుగురికి వారం  రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Drunk Drive | ఆర్మూర్​ కోర్టులో ఐదుగురికి జరిమానా..

అక్షరటుడే, ఆర్మూర్ : డ్రంకన్​ డ్రైవ్​లో (Drunk Drive) ఐదుగురికి జరిమానా విధించారని ఎస్​హెచ్​వో సత్యనారాయణ తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని ఆర్మూర్​ సెకండ్ క్లాస్​ మెజిస్ట్రేట్​ ఎదుట హాజరుపర్చామన్నారు. విచారించిన న్యాయమూర్తి ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున న్యాయమూర్తి గంగాధర్ జరిమానా విధించారని తెలిపారు.

Drunk Drive | బాల్కొండలో నలుగురికి..

అక్షరటుడే, బాల్కొండ : బాల్కొండ పోలీస్ స్టేషన్ (Balkonda Police Station) పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టిన ట్లు ఎస్సై శైలేందర్​ (SI Shailender) తెలిపారు. మండల పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపున్నట్లుగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆర్మూర్​ కోర్టులో హాజరుపర్చగా అతడికి రూ.పదివేల జరిమానా విధించారని ఆయన చెప్పారు.