HomeజాతీయంFlights Delay | పలు విమానాల రాకపోకలు ఆలస్యం.. ప్రయాణికుల ఇబ్బందులు

Flights Delay | పలు విమానాల రాకపోకలు ఆలస్యం.. ప్రయాణికుల ఇబ్బందులు

దేశవ్యాప్తంగా పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం నెలకొంది. సాంకేతిక కారణాలతో సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flights Delay | దేశవ్యాప్తంగా పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం నెలకొంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులు (Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పలు విమానాశ్రయాల్లోని చెక్-ఇన్ కౌంటర్లలో వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగా అనేక విమానాలు ఆలస్యం అయ్యాయని అధికారులు తెలిపారు. మైక్రోసాఫ్ట్​ విండోస్​ సేవల్లో తలెత్తిన సమస్యతో ఎయిర్​పోర్టు (Airports)ల్లో ఐటీ సేవలు, చెక్-ఇన్ వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. దీంతో కార్యకలాపాలను కొనసాగించడానికి విమానయాన సంస్థలు మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియలకు మారాయని కూడా అధికారులు తెలిపారు. ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ప్రభావితం అయ్యాయి.

సాంకేతిక సమస్యపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Delhi International Airport) లిమిటెడ్ ఎక్స్​ వేదికగా స్పందించింది. కొన్ని దేశీయ విమానయాన సంస్థలు ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. దీంతో విమానాలు ఆలస్యం, రద్దు కావొచ్చని తెలిపింది. తమ సిబ్బంది ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

 Flights Delay | అయ్యప్ప భక్తుల పాట్లు

శంషాబాద్‌ విమానాశ్రయం (Shamshabad Airport)లో సైతం పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం అవుతోంది. దీంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్​ నుంచి ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, గోవా, భువనేశ్వర్‌ వెళ్లాల్సిన కొన్ని విమానాలు రద్దయ్యాయి. ఎయిర్‌లైన్స్‌ ఆపరేషనల్‌ ఇష్యూస్‌ కారణంగా విమానాలు రద్దయినట్లు వెల్లడించారు. మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులు ఎయిర్​పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. విమానం ఎప్పుడు వస్తుందో సిబ్బంది చెప్పడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Must Read
Related News