400
అక్షరటుడే, వెబ్‌డెస్క్: DCP Transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు డీసీపీలను ట్రాన్స్ఫర్ (DCP Transfers) చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో డీసీపీలకు ప్రభుత్వం స్థానచలనం కలిగింది. చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతం, కూకట్పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్ నియమితులయ్యారు. శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపెట్ జోన్ డీసీపీగా రక్షితా కే మూర్తికి బాధ్యతలు అప్పగించింది. రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్, ఎస్బీ జాయింట్ సీపీగా ఎస్ఎం విజయ్ కుమార్ను నియమించింది.