అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inspectors Transfer | హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు నగర కమిషనర్ సజ్జనార్ (Commissioner Sajjanar) ఉత్తర్వులు జారీ చేశారు.నగరంలోని పలు ఠాణాల్లో ఎస్హెచ్వోలుగా పని చేస్తున్న వారితో పాటు డీఐలు, సైబర్ క్రైమ్, సీసీఎస్‌లో పని చేస్తున్న వారికి సీపీ స్థానం చలనం కలిగించారు.
మొత్తం 54 మందిని బదిలీ చేశారు. ఎక్కువ మంది సీసీఎస్, సైబర్ క్రైమ్స్ (Cyber Crimes) విభాగం నుంచి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం. అలాగే 26 మంది సీఐలను సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫర్ అయిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఐలు కొత్త పోస్టింగ్‌లో జాయిన్ కావాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) త్వరలో జరిగే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) అనంతరం ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఒకేసారి 54 మంది సీఐలను బదిలీ చేయడం గమనార్హం.

