Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | జింకను వేటాడిన కేసులో పలువురి అరెస్ట్

Nizamabad City | జింకను వేటాడిన కేసులో పలువురి అరెస్ట్

జింకను వేటాడిన కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ విలేకరుల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | జింకను (deer) వేటాడిన కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ (Rural SHO Srinivas) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిరోజుల కిందట మల్లారం (Mallaram) శివారులోని గుట్టల్లో జింకను హతమర్చారు. అటవీశాఖాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో భాగంగా బోర్గాం గ్రామానికి (Borgaon village) చెందిన ముగ్గురు వ్యక్తులు గంధం విజయ్​, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్​ నలుగురు వ్యక్తులు జింకను వేటాడినట్లు నిర్ధారించారు. పక్కా సమాచారం మేరకు గురువారం నలుగురిలో ముగ్గురు వ్యక్తులు గంధం విజయ్​, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా తాము జింకను హతమార్చినట్లు ఒప్పుకున్నారు.

నాలుగో వ్యక్తి అనిల్​ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి జింకను వేటాడేందుకు ఉపయోగించిన ఇనుప సుత్తి, ఇనుప సత్తూర్​, బరిసె, వల తదితర వస్తువులను అలాగే జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ తెలిపారు.

Must Read
Related News