CP Sai Chaitanya | భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్న పలువురి అరెస్ట్ : సీపీ

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నగరంలో భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న, వాటిని బైక్​లకు బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్​స్టేషన్​ పరిధిలో రాయల్ ఎన్​ఫిల్డ్​ సైలెన్సర్లు (Royal Enfield Silencers) అమ్ముతూ.. బిగిస్తున్నట్లుగా పక్కా సమాచారం మేరకు నాలుగు […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నగరంలో భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న, వాటిని బైక్​లకు బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్​స్టేషన్​ పరిధిలో రాయల్ ఎన్​ఫిల్డ్​ సైలెన్సర్లు (Royal Enfield Silencers) అమ్ముతూ.. బిగిస్తున్నట్లుగా పక్కా సమాచారం మేరకు నాలుగు చోట్ల దాడులు చేశామని పేర్కొన్నారు. అందులో లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్ సర్వీస్ సెంటర్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీనరసింహ ఆటోమొబైల్స్ కన్సల్టెంట్లలో సోదాలు నిర్వహించామన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమ్ముతున్న శ్రీ లక్ష్మీనరసింహ ఆటోమొబైల్స్​లో మొత్తం ఎనిమిది కొత్త సైలెన్సర్లను జప్తు చేసినట్లు చెప్పారు.

శ్రీ లక్ష్మి నరసింహా ఆటోమొబైల్స్​ యజమాని మునిశెట్టి రంజిత్​ను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు అమ్ముతున్న విజయలక్ష్మి ఆటోమొబైల్స్ సర్వీస్ సెంటర్లలో మొత్తం 10 నిషేధిత సైలెన్సర్లు, అదేవిధంగా శివ శంకర్ ఆటోమొబైల్స్​లో 11 సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్లను జప్తు చేశామన్నారు. నిషేధిత సైలెన్సర్లను (Banned Silencers) అమ్మిన యజమానులపై, వాటిని బిగించిన మెకానిక్​లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ సాయిచైతన్య చెప్పారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...