Homeజిల్లాలునిజామాబాద్​Mopal Police | ఏడుగురు గంజాయి విక్రేతల అరెస్ట్​

Mopal Police | ఏడుగురు గంజాయి విక్రేతల అరెస్ట్​

మోపాల్​ మండలం కంజర్​లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి గంజాయి సరఫరా చేస్తున్న నాందేడ్​కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal Police | ఏడుగురు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 2.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సౌత్​ రూరల్ సీఐ (South Rural CI) సురేశ్​ కుమార్​ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

మోపాల్ మండలం కంజర్​ గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో మోపాల్​ ఎస్సై సుష్మిత వెంటనే తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వినాయక్​ నగర్​కు చెందిన అమీర్​ ఖాన్​, నర్సింగ్​పల్లికి చెందిన షేక్​ అఫ్రోజ్​, కంజర్​కు చెందిన శివతేజలను అదుపులోకి తీసుకున్నారు.

Mopal Police | రైలులో గంజాయి రవాణా

ముగ్గురు నిందితులు నాందేడ్​కు (Nanded) రైళ్లలో వెళ్లి గంజాయి తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ షేక్​ ఇమ్రాన్​, మిర్జా జుబేర్​ బేగ్​ అనే వ్యక్తుల నుంచి గంజాయిని కిలోకు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దానిని మోపాల్​ తీసుకొచ్చి 5 గ్రాముల చొప్పున విక్రయిస్తున్నారు. 5 గ్రాముల ప్యాకెట్​ను రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. మైనర్లు, కాలేజీ విద్యార్థులకు సైతం వీరు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Mopal Police | నాందేడ్​కు వెళ్లి ఆపరేషన్​

కంజరలో దొరికిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నాందేడ్​ వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి అమ్ముతున్న షేక్​ ఇమ్రాన్​, మిర్జా జుబేర్​ బేగ్​తో పాటు మరో ఇద్దరు నిందితులు అముల్​ చౌరే, షేక్​ షేర్​ఖాన్​లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను కేసులో అరెస్ట్​ చేశారు. కంజర్​లో దొరికిన ముగ్గురు నిందితుల వద్ద సుమారు 1.2 కిలోల గంజాయి, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్​లో అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీఐ సురేశ్​కుమార్​, ఎస్సై సుష్మిత, సిబ్బందిని సీపీ సాయి చైతన్య అభినందించారు.