Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | విద్యార్థులకు సేవ చేయడం సామాజిక బాధ్యత

Bheemgal | విద్యార్థులకు సేవ చేయడం సామాజిక బాధ్యత

విద్యార్థులకు సేవ చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని సేవాలాల్​ సంఘం అధ్యక్షుడు భూక్యా లింబాద్రి పేర్కొన్నారు. సేవాలాల్ సంఘం ఆధ్వర్యంలో దేవన్‌పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | విద్యార్థులకు సేవ చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని సేవాలాల్​ సంఘం అధ్యక్షుడు భూక్యా లింబాద్రి పేర్కొన్నారు. మండలంలోని సేవాలాల్ సంఘం (Sewalal Sangam) ఆధ్వర్యంలో దేవన్‌పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం సంఘం ఆధ్వర్యంలో పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ పుస్తకాల పంపిణీలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్​ శ్రీకాంత్ రామావత్, సేవాలాల్ సంఘం ఉపాధ్యక్షుడు బోడ అరుణ్, దేవన్​పల్లి సర్పంచ్ అభ్యర్థి రామావత్ వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సేవాలాల్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News