Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | శిక్షణ కోసం కానిస్టేబుళ్ల ఎంపిక

Nizamabad CP | శిక్షణ కోసం కానిస్టేబుళ్ల ఎంపిక

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లను శిక్షణ నిమిత్తం ఎంపిక చేశారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad CP | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. హెడ్​ కానిస్టేబుళ్లు (Head Constables)గా వ్యవహరించే అర్హత ఉన్న వారికి ఆరు వారాల పాటు ట్రెయినింగ్​ ఇవ్వనున్నారు.

వరంగల్​లోని పోలీస్​ ట్రెయినింగ్​ సెంటర్​ (Warangal PTC)లో డిసెంబర్​ 3 నుంచి జనవరి 13 వరకు శిక్షణ ఉంటుంది. ఇందు కోసం జిల్లాలోని పలువురు కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 46 మందిని శిక్షణ కోసం ఎంపిక చేశారు. లిస్ట్​లో ఉన్న వారు శిక్షణకు వెళ్లేది లేనిది మంగళవారం ఉదయం 11 గంటలలోపు తెలపాలని సీపీ పేర్కొన్నారు.