అక్షరటుడే గాంధారి: seize illicit liquor | కామారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు కలిసి పట్టుకుని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గేట్ వద్ద సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్లయింగ్ స్పాట్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు.
కాగా, గాంధారి నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న ఒక కారు (టీఎస్ 16 ఈజ్ 2775) ఆపకుండా వెళ్లడంతో.. పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది దానిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో 48 బీర్లు, నాలుగు లీటర్ల మద్యాన్ని గుర్తించారు.
seize illicit liquor | నిందితుడిపై కేసు నమోదు..
వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడు రెస్టారెంట్ మరాఠీ బాలుపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు చెప్పారు. ఈ మద్యాన్ని బాన్సువాడ మండలం సంఘజీపేటకు తరలిస్తున్నట్లు సమాచారం.