Secunderabad Caps Gold | సికింద్రాబాద్​ క్యాబ్​ గోల్డ్​లో మొదలెట్టి.. జిల్లాలకు విస్తరించి.. బంగారు వర్తకుల భరతం పడుతున్న ఐటీ అధికారులు!

అక్షరటుడే, హైదరాబాద్: Secunderabad Caps Gold | రూ. కోట్లలో సంపాదిస్తూ.. ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడుతున్న అక్రమార్కుల భరతం పడుతున్నారు ఐటీ అధికారులు. తాజాగా బంగారు వర్తకులపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలోకి దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీ అధికారులు రంగప్రవేశం చేశారు. గత రెండు రోజులుగా బంగారం వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొదట సికింద్రాబాద్​లోని క్యాబ్​ గోల్డ్​పై దృష్టి సారించారు. రెండు రోజులుగా ఇక్కడి నాలుగు దుకాణాల్లో రైడ్స్ కొనసాగిస్తున్నారు. […]

అక్షరటుడే, హైదరాబాద్: Secunderabad Caps Gold | రూ. కోట్లలో సంపాదిస్తూ.. ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడుతున్న అక్రమార్కుల భరతం పడుతున్నారు ఐటీ అధికారులు. తాజాగా బంగారు వర్తకులపై దృష్టి సారించారు.

తెలంగాణ రాష్ట్రంలోకి దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీ అధికారులు రంగప్రవేశం చేశారు. గత రెండు రోజులుగా బంగారం వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

మొదట సికింద్రాబాద్​లోని క్యాబ్​ గోల్డ్​పై దృష్టి సారించారు. రెండు రోజులుగా ఇక్కడి నాలుగు దుకాణాల్లో రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఇక్కడి దుకాణాల్లో బంగారం కొనుగోలు చేసే ఆయా జిల్లాల వర్తకులపై దృష్టి సారించారు.

సికింద్రాబాద్​లో సోదాలు కొనసాగిస్తూనే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఐటీ అధికారులను పిలిపించి, ఆయా జిల్లాలకు పురమాయించారు. క్యాబ్​ గోల్డ్​లో పసిడి కొనుగోలు చేసే ఆయా జిల్లాల వర్తకుల వద్దకు చేరుకుని, శుక్రవారం (సెప్టెంబరు 19) ఉదయమే దాడులకు దిగారు.

నిజామాబాద్​, నిర్మల్​లోని రాజు సేట్​, మెట్​పల్లి, వరంగల్​, కరీంనగర్​ జిల్లాల్లో రాత్రి అయినా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్​లో సోదాలు కొనసాగిస్తున్న సమయంలో స్థానికుల పోలీసుల సాయం తీసుకోకుండా.. నేరుగా ఆర్మీతో రంగంలోకి దిగారు. సైన్యం సాయంతో రైడ్స్ చేస్తున్నారు.

Secunderabad Caps Gold | నిజామాబాద్​ జిల్లాలో..

ఐటీ సోదాలు కలకలం రేపాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపిన వారిని టార్గెట్​ చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్​ గంజ్​ Ganj లోని పలు బంగారు దుకాణాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఐటీ IT అధికారులు సోదాలు చేపట్టారు.

ముఖ్యంగా ఓ రెండు దుకాణాల్లో ఇన్​కమ్​ టాక్స్ రిటర్నుల income tax returns కు సంబంధించి వ్యత్యాసాలు గుర్తించిన అధికారులు సోదాలు జరిపారు.

ఈ క్రమంలో ఆదాయ పన్ను చెల్లింపుల్లో పెద్ద ఎత్తున తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై సంబంధిత అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Secunderabad Caps Gold | బంగారం బిస్కెట్​ల దందా

నిజామాబాద్​ గంజ్​లోని పలు గోల్డ్ దుకాణాల్లో బంగారం బిస్కెట్​ల Gold biscuits దందా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఐటీ అధికారులకు అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా రూ. కోట్లలో దందా కొనసాగిస్తున్నప్పటికీ ఆదాయ పన్ను రిటర్నుల్లో మాత్రం లెక్క చూపట్లేదని సమాచారం.

కాగా, తనిఖీల సమయంలో అధికారులు పలు దస్త్రాలతోపాటు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. మరో వైపు ఐటీ సోదాల నేపథ్యంలో ఇతర బంగారు దుకాణాల యజమానులు అలెర్ట్​ అయ్యారు. ముందస్తుగా దుకాణాలు మూసివేసి జాగ్రత్త పడ్డారు.

Nizamabad districtలో తాజా సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...