Yellareddy | రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) భాగంగా రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభించారు. 197 గ్రామ పంచాయతీల కోసం 57 కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడతలో కామారెడ్డి డివిజన్ (Kamareddy Division)​లోని పది మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు శనివారం సాయంత్రం వరకు పూర్తి చేశారు. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడత ఎల్లారెడ్డి […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) భాగంగా రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభించారు. 197 గ్రామ పంచాయతీల కోసం 57 కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడతలో కామారెడ్డి డివిజన్ (Kamareddy Division)​లోని పది మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు శనివారం సాయంత్రం వరకు పూర్తి చేశారు.

నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడత ఎల్లారెడ్డి (Yellareddy) డివిజన్​లోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, లింగంపేట్, బాన్సువాడ డివిజన్​లోని పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్​నగర్ మండలాల్లో పరిధిలో 197 సర్పంచ్ స్థానాలు, 1654 వార్డు స్థానాలకు నామినేషన్లు (Nominations) స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో నామపత్రాలు తీసుకోనున్నారు. అన్ని కేంద్రాలలో హెల్ప్ డెస్క్​లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...