Atukula Bathukamma | రెండో రోజు అటుకుల బతుకమ్మ.. ఈ రోజు ప్రత్యేకత తెలుసా ..

అక్షరటుడే, హైదరాబాద్ : Atukula Bathukamma | తెలంగాణ(Telangana)లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ(Engili Poola Bathukamma) ఉత్సవం ముగిసింది. తొమ్మిది రోజులపాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా, రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’ పండుగను జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగను మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. బతుకమ్మ చుట్టూ ఆడిపాడిన తర్వాత, పెద్దలు అందరికి బెల్లం, అటుకులు పంచిపెడతారు. ఈ నైవేద్యాన్ని పిల్లలు […]

అక్షరటుడే, హైదరాబాద్ : Atukula Bathukamma | తెలంగాణ(Telangana)లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ(Engili Poola Bathukamma) ఉత్సవం ముగిసింది. తొమ్మిది రోజులపాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా, రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’ పండుగను జరుపుకుంటారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగను మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. బతుకమ్మ చుట్టూ ఆడిపాడిన తర్వాత, పెద్దలు అందరికి బెల్లం, అటుకులు పంచిపెడతారు. ఈ నైవేద్యాన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అటుకులనే నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈ రోజును అటుకుల బతుకమ్మ(Atukula Bathukamma) అంటారు.

ఈ రోజున మహిళలు తలంటు స్నానం చేసి ఇళ్ళు శుభ్రం చేస్తారు. ఆ తర్వాత తంగేడు, గునుగు వంటి పూలతో రెండు వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చిన తర్వాత గౌరమ్మను కూడా తయారుచేస్తారు. ఈ అటుకుల బతుకమ్మ వేడుకల్లో పెద్దల కంటే పిల్లలే ఎక్కువ ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ రోజున మహిళలు వాయినాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పూలతో బతుకమ్మ(Bathukamma)ను అందంగా పేర్చి,కోలాటాలు,దాండియా నృత్యాలతో పాఠశాల ప్రాంగణాలను ఉత్సహాభరితంగా చేశారు.రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్ధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...